News May 7, 2025
జిల్లాలో 1,521 కొత్తగా వితంతు పింఛన్లు మంజూరు: కలెక్టర్

NTR భరోసా పింఛన్ల పంపిణీ సమయంలో పింఛనుదారులు అసంతృప్తి చెందకుండా ప్రతి మండలంలోని ప్రత్యేక అధికారులు పాల్గొని ఉదయం 7 గంటల నుంచి 10 గంటల్లోగా శతశాతం పంపిణీ కావాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 1,521 కొత్తగా వితంతు పింఛన్లు మంజూరు అయ్యాయని, కావున ఆయా మండలాల్లోని కొత్త పింఛన్ల సొమ్మును కూడా ముందుగా డ్రా చేసుకోవాలని తెలిపారు.
Similar News
News February 13, 2026
TU: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్

టీయూ కంప్యూటర్ సైన్స్&ఇంజినీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి దుర్గాప్రసాద్‌కు డాక్టరేట్ ప్రధానం చేశారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&మిషిన్ లెర్నింగ్ బేస్డ్ క్వాలిటీ అష్యూరెన్స్ అప్రోచ్ ఫర్ ఈ-లెర్నింగ్ సిస్టమ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై డా.నందిని పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. శుక్రవారం జరిగిన వైవాలో ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా జగిత్యాల JNTU ఆచార్య నరసింహ సంతృప్తి వ్యక్తం చేశారు.
News February 13, 2026
కామారెడ్డి: ప్రభావం చూపని తెలంగాణ రాజ్యాధికార పార్టీ

బీసీల కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆ పార్టీ అభ్యర్థులు పలు వార్డుల్లో పోటీ చేయగా వారి గెలుపు కోసం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా ఈ ఎన్నికల్లో నిరాశ తప్పలేదు.
News February 13, 2026
వేములవాడ: మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఈవో

వేములవాడలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను రాజన్న ఆలయ ఈవో రమాదేవి పరిశీలించారు. 14వ తేదీ శనివారం నుండి మూడు రోజులపాటు భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం రూ.కోటి 96 లక్షలతో ఏర్పాట్లు చేపట్టారు. శుక్రవారం శివార్చన స్టేజి పనులు, లడ్డు ప్రసాదాల తయారీ, క్యూలైన్లు, బారికేడ్ల ఏర్పాటు తదితర పనులను ఆమె పరిశీలించారు.


