News September 11, 2025

జిల్లాలో 1873 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది: కలెక్టర్

image

జిల్లాలో ఎరువుల పంపిణీపై వ్యవసాయ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో 78,145 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశామన్నారు. 1,873 మెట్రిక్ టన్నుల యూరియా, 26 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. ఎక్కడైనా ఎరువుల పంపిణీలో సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

Similar News

News December 14, 2025

సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు ఏవీ?

image

ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు ఉపాధి కోసం అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరంతా సంక్రాంతికి తమ సొంతూరికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. ఇప్పటికే అన్ని రైళ్ల టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక ప్రజా ప్రతినిధులు రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News December 14, 2025

CM చంద్రబాబుపై MLA చంద్రశేఖర్ సెటైర్లు

image

CM చంద్రబాబుపై YCP MLA చంద్రశేఖర్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ‘వరుస ఓటములతో ఇక ఫుట్‌బాల్ ఆడనన్నాడు. నేను దావోస్ వెళ్లినప్పుడు అర్జెంటీనా నుంచి వచ్చి కలిశాడు. ఆటలో చిట్కాలు చెప్పా. ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు మెస్సీ. HYD వస్తారా, నన్నే అమరావతి రమ్మంటారా అని ఫోన్లు. వీలైతే ఈసారి విశాఖలో లోకేశ్ టీమ్, నీ టీమ్‌కూ మ్యాచ్ పెడదామన్నాను, ఆనందపడ్డాడు. మీకు ఎవరైనా గుర్తొస్తే నాకు సంబంధం లేదు!’ అని ట్వీట్ చేశారు.

News December 14, 2025

మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన ఎన్నికలు: కలెక్టర్

image

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 2వ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామన్నారు.