News February 15, 2025

జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్‌

image

అధికారులందరు సమన్వయంతో పనిచేస్తూ పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను సజావుగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలన్నారు.  జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News March 16, 2026

మేడ్చల్: 793 అంగన్వాడీల్లో ఒంటిపూట బడులు

image

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లాలోని 793 అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఈ కేంద్రాలు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. చిన్నారులకు విద్యాబోధనతో పాటు పౌష్టికాహారం అందించి ఇంటికి పంపించనున్నారు.

News March 16, 2026

పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: DEO

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చీఫ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ఆదేశించారు. సోమవారం డీఈవో కార్యాలయం నుంచి నిర్వహించిన కమాండ్ కంట్రోల్ సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏవైనా అసౌకర్యాలు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరీక్షల విభాగపు అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ పాల్గొన్నారు.

News March 16, 2026

వరంగల్: 104 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 104 మంది పట్టుబడ్డారు. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 56, వెస్ట్ జోన్‌లో 18, ఈస్ట్ జోన్‌లో 16, సెంట్రల్ జోన్‌లో 14 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దుతో పాటు జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.