News April 13, 2025

జిల్లా టాపర్‌గా మామిడికుదురు విద్యార్థి

image

ఇంటర్ ఫలితాల్లో మామిడికుదురు GOVT కాలేజ్ విద్యార్థులు మొదటి సంవత్సరం ఫలితాల్లో వేణుశ్రీ సాయి వర్మ ఎంపీసీలో 457 మార్కులు సాధించి జిల్లా ప్రభుత్వ కళాశాలల టాపర్‌గా నిలిచారని ప్రిన్సిపల్ పద్మశ్రీ శనివారం తెలిపారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో ముస్తాక్ జెహ్మా 941, బైపీసీలో విజయనాగదుర్గ 920, CECలో కుమారస్వామి 873, HECలో సతీష్ 704 మార్కులు సాధించారు. ఫస్ట్ ఇయర్లో 56.25, సెకండ్ ఇయర్లో 73.58% ఉత్తీర్ణత సాధించారు.

Similar News

News January 23, 2026

వృద్ధాప్యానికి చెక్‌ పెట్టొచ్చు: ఎలాన్ మస్క్

image

మరణాన్ని, వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. వయసుని తగ్గించడం కూడా సాధ్యమేనని అన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో ఆయన మాట్లాడారు. శరీరంలోని అన్ని భాగాలు ఒకేసారి ముసలితనం వైపు వెళ్తున్నాయంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుందన్నారు. అయితే మనిషి ఎక్కువ కాలం జీవిస్తే క్రియేటివిటీ తగ్గి సమాజంలో వచ్చే మార్పులు ఆగిపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు.

News January 23, 2026

గంగాపురం జాతరకు ప్రత్యేక బస్సులు

image

గంగాపురంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ సంతోశ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

News January 23, 2026

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అని, దాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకున్న నాడే సమసమాజ నిర్మాణం సాధ్యమని కలెక్టర్ బాలాజీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేశారు. అనంతరం అధికారులు, ఉద్యోగులచే ‘నా దేశం-నా ఓటు’ నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు.