News December 3, 2025
జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలి: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా 347 రైతు సేవా కేంద్రాల వద్ద ‘రైతన్న మీకోసం’ గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మంగళవారం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో, 2025-26 రబీ, 2026 ఖరీఫ్, 2026-27 రబీ సీజన్ల పంట ప్రణాళికలపై రైతులతో తప్పక చర్చించాలని ఆమె సూచించారు.
Similar News
News February 18, 2026
VZM: ‘సివిల్ తగాదాలను ఇరు పక్షాలతో కౌన్సిలింగ్ చేసి పరిష్కరించాలి’

రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చే సివిల్ తగాదాల్లో ఇరు పక్షాలను పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రెవిన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే 4వ దశలో గ్రౌండ్ ట్రూతింగ్ మార్చి 15 నాటికి పూర్తి చేసి, ఏప్రిల్ 11 నాటికి లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.
News February 18, 2026
KNR: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

అత్తింటి వేధింపులకు తాళలేక మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత(29) ఆత్మహత్య చేసుకుంది. KNR రూరల్ CI నిరంజన్ రెడ్డి ప్రకారం.. GDKలో నివాసముంటుండగా అనారోగ్యం పాలైన భర్త నరేష్‌ను చికిత్స నిమిత్తం KNR ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఇక్కడ కూడా కట్నం కోసం అత్తమామలు వేధించడంతో మనస్తాపం చెంది, తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో మంగళవారం పెట్రోల్ పోసుకుని ప్రాణాలు వదిలింది. కేసు నమోదైంది.
News February 18, 2026
మరోసారి అభిషేక్ డకౌట్

T20WC: భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశ పరిచారు. పసికూన నెదర్లాండ్స్‌పై పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. కాగా అభిషేక్ ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్ కావడం గమనార్హం.


