News August 11, 2025

జిల్లా వ్యాప్తంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు ఎన్నంటే..?

image

జనగామ జిల్లా వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు 5,745 ఇళ్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. వీటిలో 4,560 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, బేస్‌మెంట్ స్థాయిలో 1,999 ఇళ్లు, రూఫ్ లెవల్‌లో 274 ఇళ్లు, స్లాబ్ లెవల్‌లో 166 ఇళ్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.

Similar News

News March 11, 2026

ఉక్రెయిన్ ఆఫర్‌కు నో.. US చేసిన బిగ్ మిస్టేక్!

image

ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడంలో US భారీ పొరపాటు చేసినట్లు సమాచారం. యుద్ధానికి 7 నెలల ముందే ఇరాన్ షాహెద్ డ్రోన్లను కూల్చే టెక్నాలజీని ఇస్తామని ఉక్రెయిన్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేసిన ఈ ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అప్పట్లో తిరస్కరించిందట. తీరా ఇప్పుడు ఇరాన్ డ్రోన్లు అమెరికా రక్షణ వ్యవస్థలను దెబ్బ తీస్తుండటంతో వాషింగ్టన్ ఇప్పుడు తిరిగి అదే ఉక్రెయిన్‌ను ఆశ్రయిస్తోంది.

News March 11, 2026

విశాఖ: ఎన్నికలపై సందిగ్ధత

image

విశాఖలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని సుమారు 64 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ ప్రక్రియ ప్రారంభమైతే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల సవరణ, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇవి పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది.

News March 11, 2026

నెల్లూరులో భారీగా మొబైల్ ఫోన్లు సీజ్

image

నెల్లూరులోని పలు మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ దుకాణాలపై అధికారులు దాడులు చేశారు. సరైన బిల్లులు, GST చెల్లించకుండా విక్రయిస్తున్న రూ.49.24 లక్షల విలువైన మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలను సీజ్ చేశారు. ఈ సరుకును వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించారు. జై అంబికా, శ్రీ అంబికా, జేపీ మొబైల్స్ షాపుల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ నరసింహారావు, DCTO విష్ణు రావు దాడులు చేశారు.