News December 3, 2025

జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం 3.0కు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

ఈనెల 5న జిల్లా వ్యాప్తంగా జరగబోయే మెగా పీటీఎం 3.0 పేరెంట్స్, టీచర్ మీట్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో మెగా పీటీఎం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కార్యక్రమ ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలన్నారు.

Similar News

News February 11, 2026

అజిత్ విమాన ప్రమాదం వెనుక కుట్ర: రోహిత్

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన <<18980385>>ప్రమాదం<<>> వెనుక కుట్ర దాగి ఉందని ఆయన మేనల్లుడు, NCP(SP) MLA రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ముందు రోజే అజిత్ బారామతికి వెళ్లాల్సి ఉండగా అనుకోకుండా షెడ్యూల్ మారే పరిస్థితులు వచ్చాయి. విమానంలో సాంకేతిక తనిఖీలు సరిగ్గా జరిగాయా? పైలట్ కపూర్ గతంలో డ్రంకెన్ పైలట్ లిస్ట్‌లో ఉన్నారని, ప్రయాణానికి ముందు బ్రీత్ అనలైజర్ టెస్టులు జరిగాయా’ అని ప్రశ్నలు లేవనెత్తారు.

News February 11, 2026

సంగారెడ్డి: ఎన్నికలు జరిగే ప్రదేశాల్లో సెలవు

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో నేడు జరగనున్న ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య స్థానిక సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు కలెక్టర్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి సెలవుదినంగా ప్రకటించినట్లు వివరించారు.

News February 11, 2026

జనగామ జిల్లా యువతికి యూజీసీ నెట్‌లో ఆలిండియా రెండో ర్యాంకు!

image

రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామానికి చెందిన మాచర్ల రేణుక-వాసు దంపతుల కుమార్తె శిరీష యూజీసీ నెట్‌లో 99.901 పర్సంటేజ్ సాధించి ఆలిండియా రెండో ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా యువతిని కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా గ్రామస్థులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.