News August 14, 2025

జిల్లా వ్యాప్తంగా 84.2 మి.మీ వర్షపాతం నమోదు

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 84.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అత్యధికంగా గుడిబండ మండలంలో 18.4 మి.మీ, అత్యల్పంగా అమరాపురం మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. రొళ్ల 10.2 మి.మీ, మడకశిర 6.6 మి.మీ, ముదిగుబ్బ 5.8 మి.మీ, గాండ్లపెంట 4.4 మి.మీ, అగళి 4.2 మి.మీ, తాడిమర్రి 3.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు.

Similar News

News March 12, 2026

అనంత: పరీక్షలకు 286 మంది డుమ్మా!

image

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్ష జరిగింది. ఈ రోజు పరీక్షలకు సెట్-I ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 5,223 గాను 4,937 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 286 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.

News March 12, 2026

పెట్రోల్, డీజిల్ ఉంది.. ఆందోళన వద్దు: IOCL

image

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. దేశంలోని అన్ని ఇండియన్ ఆయిల్ బంకులు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని, సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ సప్లై చేస్తున్నామని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

News March 12, 2026

ADB: ఉచిత శిక్షణ.. APPLY NOW

image

టాస్క్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సీ, జావా, పైథాన్, వెబ్ డెవలప్‌మెంట్, సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. గ్రాడ్యుయేట్లు, ఫైనలియర్ విద్యార్థులు అర్హులు. మార్చి 16లోగా ఆధార్, పాన్ కార్డ్, సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 9502786438 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.