News August 10, 2024
జిల్లా సమగ్రాభివృద్ధికి యాక్షన్ ప్లాన్: కలెక్టర్
2047వ సంవత్సరానికి అన్ని రంగాల్లోనూ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావడం అత్యంత కీలకమని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ దిశగా బ్యాంకు రుణాలిచ్చి స్వశక్తి సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖలు, బ్యాంకుల అధికారులతో కలెక్టర్ శుక్రవారం చర్చించారు.
Similar News
News September 18, 2024
ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులతో ప్రకాశం కలెక్టర్ సమీక్ష
ఆస్పత్రులలో పారిశుద్ధ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా ఆస్పత్రుల వారీగా ఉన్న సిబ్బంది విధుల కేటాయింపు, పారిశుద్ధ్యం, భద్రత, వివిధ పనులలో పురోగతిపై చర్చించారు. హెచ్.డి.ఎస్. నిధుల లభ్యత, ఎన్.టి.ఆర్. వైద్య సేవలు లభిస్తున్న తీరు తదితరాలపై సమీక్షించారు.
News September 17, 2024
ఒంగోలులో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఒంగోలు నగర పరిధిలోని హర్షిణి జూనియర్ ఇంటర్ కాలేజీల్లో ఓ విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వడ్డిముక్కల భావన మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.
News September 17, 2024
ఎమ్మెల్యే బూచేపల్లి హౌస్ అరెస్ట్
తమ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దర్శిలో నేడు నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఉదయం ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ వెంకాయమ్మకు నోటీసులు అందజేసి గృహ నిర్బంధం చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు సూచించారు. వారితో పాటు, టీడీపీ నాయకులకు సైతం నోటీసులు ఇచ్చారు.