News May 1, 2024
జిల్లా సరిహద్దులో భారీగా మద్యం పట్టివేత

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం తడ.. బివి పాలెం చెక్ పోస్ట్ వద్ద సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాండిచ్చేరి నుంచి నెల్లూరుకి మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న 300 కేసుల మద్యం (14,400 క్వార్టర్ బాటిళ్ల) మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ సుమారు రూ.7,42,000 ఉంటుందని అంచనా.
Similar News
News December 15, 2025
నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్

నెల్లూరు నగర మేయర్‌గా స్రవంతి చేసిన రాజీనామాకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. కొత్త మేయర్‌ను ఎన్నుకునే దాకా.. కార్పొరేషన్‌లో పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా డిప్యూటీ మేయర్లలో ఒకరిని మేయర్‌గా ప్రకటించాలని కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో కొత్త మేయర్ ఎన్నిక జరిగే వరకు రూప్ కుమార్ యాదవ్ ఇన్‌ఛార్జ్ మేయర్‌గా కొనసాగుతారని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
News December 15, 2025
బిట్రగుంట: రైలు ఢీకొని తెగిపడిన యువకుడి తల

బిట్రగుంట రైల్వే స్టేషన్ దగ్గర గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. 20 – 25 ఏళ్ల వయస్సుగల యవకుడు రైలు వచ్చేసమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈఘటనలో యువకుడి తల తెగిపడింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాలు తెలిసినవారు కావలి రైల్వే పోలీసులను సంప్రదించగలరు.
News December 15, 2025
నెల్లూరు మేయర్ రాజీనామా ఆమోదం

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొకుండానే సొంత నిర్ణయం తీసుకున్నారు. మేయర్ తన ప్రతినిధి ద్వారా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాజీనామా లేఖను అందించారు. ఆ రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. 18న కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరపనున్నారు.


