News October 31, 2024
జి.కొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
జి.కొండూరు మండలం ఆత్కూర్ క్రాస్ రోడ్డు వద్ద గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బొలెరో ట్రక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన వారు సాయి, నాగరాజుగా పోలీసులు గుర్తించారు. ఎస్ఐ సతీశ్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో మరో 10మందికి గాయాలైనట్లు చెప్పారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 3, 2024
మంచి రోజులు వచ్చాయి : మంత్రి కొలుసు
టీడీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వచ్చాయని, ఇకపై మంచి రోడ్లూ వస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి శనివారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.860 కోట్లతో గుంతలు పడిన రోడ్లను బాగుచేసే పనులు మొదలుపెట్టామని కొలుసు పేర్కొన్నారు. ప్రజల భద్రత, సౌకర్యమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కొలుసు ఈ మేరకు ట్వీట్ చేశారు.
News November 2, 2024
కైకలూరు: బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని ఆమెపై అత్యాచారయత్నం చేసిన ఘటనలో శనివారం పోక్సో కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు కైకలూరు టౌన్ ఎస్ఐ వెంకటకుమార్ తెలిపారు. కైకలూరుకి చెందిన బాలికను, అదే గ్రామానికి చెందిన సుగుణరావు అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి శారీరకంగా అనుభవించడానికి ప్రయత్నించగా బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. విషయం తెలిసిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 2, 2024
విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా హిసార్(HSR), తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి శనివారం HSR- TPTY(నెం.04717),నవంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం TPTY- HSR(నెం.04718) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ, తిరుపతితో పాటు ఏపీలో నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతాయన్నారు.