News November 6, 2025

జీతాల కోసం ఎదురుచూపు: ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదన

image

ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు అందకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం కొన్ని శాఖలకు మాత్రమే చెల్లింపులు జరిగాయని, రెవెన్యూ, దేవాదాయం వంటి కీలక శాఖల అధికారులకు కూడా జీతాలు విడుదల కాలేదని కాకినాడ జిల్లా ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఒకటో తేదీనే ఇస్తామని చెప్పినా కూటమి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో, తాము బ్యాంకు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.

Similar News

News January 14, 2026

ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నుంచి ‘SIR’

image

AP, TGలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో తొలి దశ ముగియడంతో రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్, TN, UP, WB సహా పలు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీంతో మూడో దశలో ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ‘సర్’ చేపట్టనున్నారు.

News January 14, 2026

మెట్రో మార్కు చిత్రకళ.. ‘పరిచయ్’ అదిరింది బాసూ!

image

మెట్రో రైలును పట్టాలెక్కించినట్టే చిత్రకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలంటున్నారు NVS రెడ్డి. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, క్యాంప్ కళాభిమానులను ఫిదా చేస్తోంది. ఒకేచోట ప్రదర్శన, ప్రత్యక్ష చిత్రలేఖనం చూడటం అరుదైన అవకాశమని చెప్పుకొచ్చారు. జయవంత్ నాయుడు ఆధ్వర్యంలో 12 మంది దిగ్గజ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి.

News January 14, 2026

ఊల వేసిన మడిలో నీరుంటుందా?

image

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.