News November 19, 2025
జీపీ ఎన్నికలు.. ఉమ్మడి పాలమూరులో బీసీ స్థానాలపై ఆసక్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత, ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించగా, ఉమ్మడి పాలమూరులో 704 జీపీలలో బీసీలు సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో ఆశావహులు తమ సన్నాహాలను మొదలుపెట్టారు.
Similar News
News January 19, 2026
KMR: అభ్యర్థుల ఎంపికకు కసరత్తు

మరో రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నగరా మోగనుండటంతో అభ్యర్థుల ఎంపికకు ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థులకు వ్యక్తిగతంగా బరిలో నిలిచేందుకు సూచించగా, అధికారికంగా జాబితాను ప్రకటించనుంది. కాంగ్రెస్, BRS పార్టీలు ఎలాగైనా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి గట్టి పోటీనిచ్చే అభ్యర్థుల ఎంపికకు ముమ్మర ప్రయత్నం చేస్తోంది.
News January 19, 2026
న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. షమీ ఉండాల్సిందేమో!

న్యూజిలాండ్‌తో సిరీస్ కోల్పోయి టీమ్ ఇండియా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ముఖ్యంగా NZ ప్లేయర్ మిచెల్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. సిరీస్‌లో అతను 352 పరుగులతో విధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలువురు స్టార్ బౌలర్ షమీని గుర్తు చేస్తున్నారు. అతడు ఉండుంటే మిచెల్ ఆటలు సాగేవి కావని, గత రికార్డులే అందుకు నిదర్శనమని అంటున్నారు. ఇరువురి మధ్య పోరులో 16 సగటుతో 4 సార్లు ఔట్ చేసి షమీ ఆధిపత్యం ప్రదర్శించారు.
News January 19, 2026
అడవిలో హైటెక్ పద్ధతిలో వన్యప్రాణుల గణన

ఖమ్మం జిల్లాలోని 60,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణంలో వన్యప్రాణుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పర్యవేక్షణలో 85 బీట్లలో అధికారులు, వలంటీర్లు 5 రోజుల పాటు కాలినడకన సర్వే చేయనున్నారు. ఈసారి పులులు, చిరుతల ఆనవాళ్లను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ప్రత్యేక మొబైల్ యాప్, జియో ట్యాగింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.


