News November 19, 2025
జీపీ ఎన్నికలు.. ఉమ్మడి పాలమూరులో బీసీ స్థానాలపై ఆసక్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత, ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించగా, ఉమ్మడి పాలమూరులో 704 జీపీలలో బీసీలు సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో ఆశావహులు తమ సన్నాహాలను మొదలుపెట్టారు.
Similar News
News January 19, 2026
50 వేల మంది ఉద్యోగులను తీసుకుంటాం: డెలాయిట్

గ్లోబల్ సంస్థ డెలాయిట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియాలో 50 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘ఇండియాలో 1.4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచంలోని ప్రతి నలుగురు డెలాయిట్ ఉద్యోగుల్లో ఒకరు ఇండియన్. మరో 50 వేల మందికిపైగా తీసుకుంటాం. సంస్థ విస్తరణ కోసం మంగళూరు(KA)లో బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం’ అని కంపెనీ సౌత్ ఆసియా సీఈవో రోమల్ శెట్టి ఓ కార్యక్రమంలో తెలిపారు.
News January 19, 2026
హైదరాబాద్‌లో 54 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

నగరంలో పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. మొత్తం 54 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుంచి పెద్ద సంఖ్యలో SHOలు ఇతర విభాగాలకు బదిలీ అయ్యారు. మరో 26 మంది బదిలీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వారందరూ సీపీ కార్యాలయంలో వెంటనే రిపోర్ట్ చేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
News January 19, 2026
VJA: వామ్మో.. పండుగ 3 రోజుల్లో ఇంత తాగేశారా!

సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ నెల 12 నుంచి 14 వరకు మూడు రోజుల్లో మొత్తం రూ. 38 కోట్ల సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు రూ. 4 కోట్లు పెరిగాయి. జిల్లాలో జరిగిన కోడిపందేలు, పండుగకు వచ్చిన జనసందోహం ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. జనవరి 15, 16 తేదీల్లో మద్యం డిపోలకు సెలవు కావడంతో విక్రయాలు జరగలేదు.


