News December 11, 2025
జీహెచ్‌ఎంసీ వార్డులపై ఫిర్యాదుల ‘సునామీ’

GHMC పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాల పర్వం మొదలైంది. 300 వార్డులుగా డీలిమిటేషన్ చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ అవగా దీనిపై నిరసన గళం వినిపిస్తోంది. ప్రోఫార్మా-III ద్వారా అందిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 10న ఏకంగా 40 ఫిర్యాదులు నమోదయ్యాయి. ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న వార్డుల సరిహద్దులు, జనాభా లెక్కలపై రాజకీయ పక్షాలు, స్థానిక ప్రజల నుంచి భారీగా విమర్శలు వస్తున్నాయి.
Similar News
News January 13, 2026
HYD: హైడ్రా వారి జోలికి వెళ్లదు..!

నివాసాల జోలికి హైడ్రా వెళ్లదని మరోసారి స్పష్టం చేసింది. 2024 జులైలో హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన ఇళ్లను తొలగించకూడదని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ నిబంధన అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని పేర్కొంది. చట్టం ప్రకారం హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని పేర్కొంది. నిన్న హైడ్రా ప్రజావాణికి 76 ఫిర్యాదులు అందాయి.
News January 13, 2026
హైదరాబాద్: జైళ్లలో Gen Z మెజారిటీ!

తెలంగాణ జైళ్ల యాన్యువల్ రిపోర్టు చూస్తే మతిపోతోంది. సైబర్ క్రైమ్ కేసులు బాంబులా పేలగా, తాగి నడిపి 2,833 మంది లోపలికి వెళ్లారు. మొత్తంగా ఖైదీల సంఖ్య 42 వేలు దాటింది. అందులో Gen Z మెజారిటీ ఉండటం కలవర పెట్టే అంశం. 2025 రిపోర్టు ప్రకారం.. 18,737 మంది యువకులు, 654 మంది యువతులు, 22 ఇతరులు కలిపి 19,413 మంది ఖైదీ అయ్యారు. 2024తో పోలిస్తే నేరలు చేసిన వారి సంఖ్య 13.31% శాతం పెరగడం గమనార్హం.