News August 22, 2025

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయాలు

image

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 32 ఎజెండా అంశాలు, 7 టేబుల్ అంశాలకు ఆమోదం లభించింది. ముందుగా రామంతాపూర్ కృష్ణాష్టమి విషాదంలో బాధితులకు మౌనం పాటించి సంతాపం తెలిపారు. వెండింగ్ షాపుల టెండర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, ఎల్ఈడీ లైట్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు. ఈ నిర్ణయాలతో నగరవాసులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Similar News

News January 15, 2026

HYD: రేపు రాత్రి ఆకాశంలో జాతర

image

సంక్రాంతి వేళ పతంగుల జోష్ మామూలుగా లేదు. భోగి వేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా భవనాల మీద తెగ ఎంజాయ్ చేశారు. పతంగులు కాట్ చేస్తూ కేరింతలు చేశారు. ఇక రేపు రాత్రి కూడా వైబ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా బేగంబజార్‌లో నైట్ కైట్ ఫెస్టివల్ అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం తర్వాత చిన్న ఎయిర్‌బెలూన్‌లు, లైట్ పతంగులను భవనాల మీద ఎగరేస్తుంటారు. ఇక్కడ పతంగుల జాతరను చూసేందుకు నగర నలుమూలల నుంచి తరలివెళ్తారు.

News January 14, 2026

హైదరాబాద్‌లో GEN Z రూల్స్!

image

జాబ్ విషయంలో GEN Z కొత్తదారులు వెతుకుతోంది. IT కారిడార్‌లోని ఆఫీస్ నిబంధనలు, టైమింగ్, వర్క్ ప్రెషర్‌‌ను అవాయిడ్ చేస్తున్నారు. పర్మనెంట్ అనే ఆలోచన పక్కనబెట్టి జాబ్ నచ్చితేనే చేస్తామంటున్నారు. 1, 2 ఏళ్లలో ఉద్యోగాలకు రిజైన్‌ చేస్తున్న వారిలో GEN Z మెజారిటీ ఎక్కువ అని ఇటీవల సర్వేలో తేలింది. డెడికేషన్ ఉన్నా.. చిల్ అవ్వకుంటే ఎలా? అనే ఫీల్‌లో ఉంటున్నారు. WFH అయితే ఇంకా బెటర్ అంటున్నారు.

News January 14, 2026

HYD: డస్ట్ బిన్‌లే ఆఫీస్‌కు కాల్ చేస్తాయి!

image

రోడ్డు మీద డస్ట్‌బిన్లు నిండిపోయి వాసన వస్తున్నాయా? ఫ్యూచర్ సిటీలో ఆ ఛాన్స్ లేదు. ముచ్చర్లలో రాబోతున్న ఈ పారిశుద్ధ్య వ్యవస్థ ఇండియాలోనే అతిపెద్ద ‘జీరో-హ్యూమన్ ఇంటర్వెన్షన్’ ప్రాజెక్ట్. ప్రతి బిన్‌కు అమర్చే ‘సెన్సార్లు’ చెత్త 80% నిండగానే కమాండ్ సెంటర్‌కు సిగ్నల్ పంపిస్తాయి. డ్రైవర్ లేని ‘ఎలక్ట్రిక్ వ్యాన్లు’ ఎప్పటికప్పుడు ఆ బిన్‌ను ఖాళీ చేస్తాయి. దావోస్‌లో CM చూపించబోయే ‘క్లీన్’ సిటీ సీక్రెట్ ఇదే.