News October 6, 2025
జూబ్లీలో హస్తం మకాం: వార్డుకో మంత్రి.. వీధికో MLA

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. HYDలో పార్టీ గుర్తుపై గెలిచిన MLA లేకపోవడంతో ఇక్కడ గెలిచి బోణీ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగానే వార్డుకో మంత్రిని ఇన్‌ఛార్జీగా నియమించాలని PCC నిర్ణయించింది. వీధికో ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలని సూచించి, జాబితా రెడీ చేశారు. నేడో, రేపో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సెగ్మెంట్‌లో మకాం వేయనున్నారు.
Similar News
News January 14, 2026
ట్రాఫిక్ జామ్ ఇక గతం: భాగ్యనగరంలో త్వరలో నయా ‘హైవే’ మ్యాజిక్!

బండి బయటకు తీస్తే చాలు.. గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నరకాన్ని చూసున్న ఐటీ కారిడార్ వాసులకు ఇక ఆ ఇబ్బందులు తీరినట్లే! హైటెక్ సిటీ, మాదాపూర్, గొల్కొండ నుంచి ORR వరకు రోడ్ల రూపురేఖలను మార్చేందుకు HMDA సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కేవలం రోడ్లే కాదు, పాదాచారుల కోసం ఆకాశ మార్గాలు (Sky walks), వాహనాల కోసం భారీ ఫ్లైఓవర్లతో 2050 నాటి అవసరాలకు తగ్గట్టుగా నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు.
News January 14, 2026
HYD: బోగి మంటలు.. సంప్రదాయం వర్సెస్ ఆధునికం

RTC X రోడ్స్, చిక్కడపల్లి గల్లీల్లో భోగి మంటలు హోరెత్తుతున్నాయి. కానీ, హైటెక్ సిటీ వైపు వెళ్తే సీన్ రివర్స్ కనిపిస్తోంది. కాలుష్యం పేరిట అక్కడ మంటల బదులు ఎల్‌ఈడీ వెలుగులు, ఇండోర్ పూజలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తెల్లవారుజామున రోడ్లపై పెద్ద ఎత్తున వేసే మంటలు, మరోవైపు వాట్సాప్ గ్రూపుల్లో ‘గ్రీన్ గిల్ట్’ రాజకీయాలు పండగ జోష్ కంటే కూడా క్లాస్, ఎడ్యుకేషన్ ఇక్కడ మంటల సైజును డిసైడ్ చేస్తున్నాయి.
News January 13, 2026
హైదరాబాద్ ఖాళీ.. కాదు రద్దీ.. మీ కామెంట్?

HYD ఖాళీ అయ్యిందని కొందరి SM పోస్టులు వైరల్ అయ్యాయి. సంక్రాంతి కోసం జనాలు సొంతూళ్లకు వెళ్లారని దీని అర్థం. ఈ పరిస్థితి సిటీలో ఓ వైపు మాత్రమే కనిపిస్తోందని మరికొందరి వాదన. పండుగలకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ సాధారణమని, సిటీలో ఏ మూలకు వెళ్లిన ట్రాఫిక్ ఉందని చెబుతున్నారు. పల్లెబాట పట్టిన వీడియోలు, సిటీ రష్ వీడియోలు SMలో పోటీ పడుతున్నాయి. మరి మీ ఏరియాలో పరిస్థితి ఏంటి? కామెంట్ చేయండి.


