News August 21, 2025
జూబ్లీహిల్స్‌లో BRS జెండా ఎగరాలి: KTR

రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండాను రెపరెపలాడించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బుధవారం ఆయన్ను కార్యకర్తలతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సెగ్మెంట్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఇరువురు చర్చించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పని చేయాలని, గత BRS హయాంలో సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సునీతకు KTR దిశానిర్దేశం చేశారు.
Similar News
News January 19, 2026
ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీ మేరకు సోమవారం నెం.07479/78 అనకాపల్లి- చర్లపల్లి మధ్య ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా స్పెషల్ రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ఈరోజు అర్ధరాత్రి 3.08కి కైకలూరు, 3.40కి గుడివాడ, ఉదయం 4.40కి విజయవాడ, ఉదయం 11.30కి చర్లపల్లి చేరుకుంటాయన్నారు. ప్రయాణికులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని కోరారు.
News January 19, 2026
KNR: సబ్ లీజు’ దందా.. విద్యాశాఖ పట్టించుకోవట్లే!

KNR ప్రకాష్ గంజ్ హై స్కూల్ దుకాణ సముదాయాల్లో లీజు పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లీజుదారులు 21 దుకాణాలకు గాను ఒక్కో షాపుకు రూ.వెయ్యి చొప్పున విద్యాశాఖకు చెల్లిస్తూ రూ.20 వేలకు సబ్ లీజుదారుల నుంచి వసూలు చేస్తున్నారని, ముగ్గురు లీజుదారులు ప్రముఖ వ్యాపారులకు అగ్రిమెంట్ పద్ధతిలో ఏకంగా అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖ ఈ అక్రమాలకు చెక్ పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News January 19, 2026
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.


