News August 21, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం EC కసరత్తు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం EC కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్త ఓటర్ల నమోదు, మార్పు చేర్పులకు అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. 25 లోపు అభ్యంతరాలను పరిష్కరించాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30న తుది జాబితా విడుదల కానుంది. జులై 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటురు నమోదు చేసుకోవచ్చు.
SHARE IT
Similar News
News January 19, 2026
HYD: మూలికలతో మగతనం.. సాధ్యమా?

HYD రోడ్ల పక్కన లైంగిక సామర్థ్యం పెరుగుతుందని మూలికలు, కషాయాలు అమ్మే షెడ్లు చూసే ఉంటారు. ఘట్కేసర్, ఉప్పల్, పెద్దఅంబర్‌పేట్, హయత్‌నగర్, కీసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను DGCA అధికారులు పరిశీలించారు. వాటిలో శాస్త్రీయత లేదని, అలాంటివి నమ్మి మోసపోవద్దన్నారు. వీరు పురుషుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారని, అలాంటి దుకాణాలకు వెళ్లొద్దని, వెళ్లినా తెలివిగా వ్యవహరించాలని సూచించారు.
# SHARE IT
News January 19, 2026
HYD: ఎక్కడ పడితే అక్కడ సిమ్‌లు కొంటున్నారా?

సిమ్ కార్డులు విక్రయిస్తున్న అంతరాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాకు చెందిన దినేష్, సాయిప్రదీప్ నిబంధనలకు విరుద్ధంగా సిమ్ కార్డులను అమ్ముతూ మోసాలు చేస్తున్నారు. సిమ్ కోసం వచ్చిన వారి వేలిముద్రలతో మరికొన్ని సిమ్‌లు యాక్టివేట్ చేసుకుని డ్రగ్స్ ముఠాలు, సైబర్ నేరస్థుకు అమ్ముతున్నారు. దీంతో సీసీఎస్ స్పెషల్ టీమ్ వీరిని అదుపులోకి తీసుకొని 184 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
News January 19, 2026
HYD: రికార్డుల్లో లేని నాలా.. రియల్టర్లకు నోట్ల మాలా..!

నగర శివార్లలో నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తామన్న కొత్త GO అక్రమార్కులకు వరంగా మారనుంది. రెవెన్యూ రికార్డుల్లో లేని కాలువలనూ పరిగణనలోకి తీసుకోవచ్చన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని కొందరు బడా రియల్టర్లు తమ వెంచర్ల మధ్యలో పనికిరాని గుంటలను నాలాగా చూపించుకోవచ్చు. అధికారులతో కుమ్మక్కై రూ.కోట్లు విలువైన TDR సర్టిఫికెట్లు పొందేందుకు స్కెచ్ వేశారని విశ్లేషకుల అంచనా. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.


