News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: ఓటు ఇక్కడే.. వాళ్లిక్కడలేరు..!

image

ఓటింగ్ శాతం పెరిగితే, గెలుపు అవకాశాలను పెరుగుతాయని ప్రధాన పార్టీలు స్థానికంగాలేని ఓటర్ల కోసం వెతుకుతున్నాయి. ఎవరెవరు, ఎక్కడెక్కడ ఉంటున్నారని ఆరా తీస్తున్నారు. ఆయా ఫ్యామిలీ, బంధువులు, మిత్రులతో మాట్లాడి వారిని రప్పించడయ్యా.. ప్రయాణ ఖర్చులతో పాటు అదనపు డబ్బలిస్తాం. వాళ్లని ఇక్కడికి తీసుకురమ్మని డబ్బులిచ్చే పనిలో పడ్డారు. ‘ఎలక్షన్ టైమ్‌‌లో తప్ప మమ్మల్నెవరు పట్టించుకుంటారు’అని ప్రజలు అనుకుంటున్నారు.

Similar News

News January 24, 2026

మంటలు అదుపులోకి.. సెల్లార్‌లో ఐదుగురు: ఫైర్ డీజీ

image

TG: హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చినట్లు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. దట్టమైన పొగ ఉండటంతో సెల్లార్‌లోకి వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. ఆ ఏరియాలో ఫర్నిచర్ భారీగా డంప్ చేశారని, అందుకే సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిందన్నారు. మరో 2 గంటల్లో లోనికి వెళ్తామన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం సెల్లార్‌లో ఐదుగురు చిక్కుకున్నట్లు పేర్కొన్నారు.

News January 24, 2026

లబ్ధిదారులకు రూ.లక్ష రుణ సదుపాయం: భూపాలపల్లి కలెక్టర్

image

భూపాలపల్లి జిల్లాలో ఇందిరమ్మ పిల్లల అబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రూ.లక్ష రుణ సదుపాయంగా ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరైన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇళ్లు మంజూరైన వారు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని, ప్రతి సోమవారం పురోగతి సమీక్ష చేస్తామన్నారు.

News January 24, 2026

HYD: బీజేపీ కార్పొరేటర్ కన్నుమూత

image

గ్రేటర్ హైదరాబాద్ BJPలో తీవ్ర విషాదం నెలకొంది. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండే చంపాపేట కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగా మధుసూదన్ రెడ్డి చనిపోయారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పార్టీ శ్రేణులు, ఇతర పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.