News October 7, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. చంద్రబాబు ప్లాన్ ఇదేనా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీపై TDP కసరత్తు మొదలుపెట్టింది. అనూహ్యంగా నందమూరి సుహాసిని పేరును తెరపైకి తెచ్చింది. ఇప్పటికే APలో BJPతో పొత్తు పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు.. TGలో ఈ బైపోల్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని, BJPతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు టాక్. దీనిపై BJP జాతీయ నేతలతో CBNచర్చించనున్నారు. ఒకవేళ BJPపొత్తుకు ఒప్పుకోకుంటే ఒంటరిగా పోటీ చేయనున్నారు.
Similar News
News January 12, 2026
NRPT: ‘మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి’

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సీఎస్ రామకృష్ణారావు అన్నారు. సోమవారం HYD నుంచి జిల్లాల కలెక్టర్లతో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇవాళ తుది ఓటరు జాబితా విడుదల చేశామని కలెక్టర్ సీఎస్‌కు వివరించారు.
News January 12, 2026
కోడి పందేల నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ

జిల్లాలో కోడి పందేలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. కోడి పందేలు నిషేధం, శిక్షార్హ నేరం అనే అంశంపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులతో కలిసి ఆవిష్కరించారు.
News January 12, 2026
తిరుపతి: శెట్టిపల్లి లబ్ధిదారులకు సంక్రాంతి బోనస్

తిరుపతి జిల్లా సెట్టిపల్లి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ఊరట కల్పించింది. తుడా అథారిటీ ద్వారా కేటాయించే మొత్తం 286.83 ఎకరాల భూమికి సంబంధించిన అన్ని కన్వేయన్స్ డీడ్లపై స్టాంప్ డ్యూటీతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సుమారు రూ.16.25 కోట్ల వరకు ఆర్థికభారం తగ్గనుందని అధికారులు అంచనా వేశారు.


