News October 7, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. BJP లిస్ట్‌లో నందమూరి సుహాసిని పేరు..?

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. పోటీ అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల కమిటీని పార్టీ నియమించింది. లంకాల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, నందమూరి సుహాసిని సహా ఏడుగురి పేర్లు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్‌లో ఎన్నికల రణరంగం మరింత వేడెక్కనుంది.
Similar News
News January 23, 2026
కాజీపేట వరకే సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు

భద్రాచలం రోడ్-బల్లార్షా మధ్య నడిచే 17033/17034 సింగరేణి ఎక్స్‌ప్రెస్ మెము రైలు ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు పూర్తి స్థాయిలో కాకుండా, కాజీపేట వరకు నడవనుందని రైల్వే అధికారులు తెలిపారు.మందమర్రిలో 3వ లైన్ పనులు, ట్రాక్ మరమ్మతు నేపథ్యంలో ఈ మార్పు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ రైళ్లను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. పనులు పూర్తయిన తర్వాత రైలు యథావిధిగా నడవనుందన్నారు.
News January 23, 2026
MBNR: ఎంవీఎస్ కళాశాలలో రేపు జాతీయ స్థాయి సెమినార్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ స్థాయి బహుశాఖ సెమినార్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. కె.పద్మావతి తెలిపారు. విద్యా, వైద్య, పరిశోధన రంగాల్లోని నూతన ఆవిష్కరణలపై ఈ సదస్సు జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్ ప్రొ. వి.బాలకృష్ణారెడ్డి, గౌరవ అతిథిగా పాలమూరు వర్సిటీ వీసీ ప్రొ. జి.ఎన్.శ్రీనివాస్ హాజరుకానున్నారు.
News January 23, 2026
VKB: 1800-102-7222కు కాల్ చేయండి

జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్-12లో 106 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించామని వికారాబాద్ SP స్నేహ మెహ్రా తెలిపారు. శుక్రవారం ఎస్పీ ఆఫీస్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. వీరిలో 90 మంది బాలురు, 16 మంది బాలికలు ఉన్నారు. యజమానులు 14ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1908, 1800-102-7222, 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.


