News June 17, 2024

జూరాలకు 8,649 క్యూసెక్కుల వరద

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 8,849 క్యూసెక్కుల వరద వస్తుండగా.. మొత్తం 1,476 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.531 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 23, 2026

గంగాపురం జాతరకు ప్రత్యేక బస్సులు

image

గంగాపురంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ సంతోశ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

News January 23, 2026

MBNR: ఎంవీఎస్‌ కళాశాలలో రేపు జాతీయ స్థాయి సెమినార్‌

image

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ స్థాయి బహుశాఖ సెమినార్‌ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ డా. కె.పద్మావతి తెలిపారు. విద్యా, వైద్య, పరిశోధన రంగాల్లోని నూతన ఆవిష్కరణలపై ఈ సదస్సు జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్‌ ప్రొ. వి.బాలకృష్ణారెడ్డి, గౌరవ అతిథిగా పాలమూరు వర్సిటీ వీసీ ప్రొ. జి.ఎన్.శ్రీనివాస్‌ హాజరుకానున్నారు.

News January 23, 2026

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 11 మంది సీఐల బదిలీ

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో పని చేస్తున్న 11 మంది సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-2 అదనపు డీజీపీ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ట్రాఫిక్ సీఐగా ఉన్న భగవంత రెడ్డిని మరికల్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు తక్షణమే తమ కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.