News August 12, 2025

జూరాల ప్రాజెక్టుపై అదనపు బ్రిడ్జి: మంత్రి వాకిటి

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అదనంగా మరో బ్రిడ్జిని నిర్మిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. మంగళవారం ఆత్మకూరులో మినీ స్టేడియం స్థల పరిశీలన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయించామని, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అపోహలు అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనరెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.

Similar News

News March 6, 2026

చెన్నూరు: ఉపాధ్యాయుడిగా మారిన జిల్లా కలెక్టర్

image

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. చెన్నూరు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. నేను ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోస్ట్కాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

News March 6, 2026

దీదీకి కొత్త తలనొప్పి?

image

ఎన్నికల వేళ బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్ <<19306866>>రవి<<>> రావడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో తమిళనాడుకు గవర్నర్‌గా వచ్చిన రవి డీఎంకే ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. రాష్ట్ర పాలసీను విభేదించడం, బిల్లులు ఆమోదించకపోవడం వంటివి చేసి వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్‌గా రవి వైఖరి ఎలా ఉంటుందోనని తృణమూల్ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

News March 6, 2026

మంచిర్యాల: 9న అప్రెంటిస్ షిప్ మేళా

image

మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 9న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వై.రమేశ్ తెలిపారు. 11 ప్రముఖ కంపెనీలలో మొత్తం 395 ఖాళీలు ఉన్నాయన, శిక్షణ సమయంలో స్టైఫండ్ అందజేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10గంటలకు నిర్వహించనున్న అప్రెంటీషిప్ మేళాకు అర్హులైన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.