News November 15, 2024

జూరాల ప్రాజెక్టు తాజా సమాచారం

image

ప్రియదర్శని జూరాల ప్రాజెక్టులో తాజా సమాచారం ఇలా ఉంది. శుక్రవారం ఉదయం నాటికి ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ సమార్థ్యం 9.357 టీఎంసీలకు గానూ 5.650 టీఎంసీలు ఉన్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజినీర్ నాగేశ్వరరావు తెలిపారు. నెట్టెంపాడుకు 609, ఎడమ కాలువకు 957, కుడికాలువకు 368 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం అవుట్ ఫ్లో 2,500 క్యూసెక్కులుగా వెళ్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 13, 2024

గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ సంతోష్

image

15, 16 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణ పై ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. 2 రోజులు, రోజుకు 2 దఫాలుగా పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం 10:00 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3:00 నుంచి 5: 30 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 25 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News December 13, 2024

ఉమ్మడి జిల్లాలోని నేటి..TOP NEWS!

image

❤MBNR: రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
❤సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్ రెడ్డి
❤అయిజ: Way2News ఎఫెక్ట్.. నిత్యవసర సరుకులు అందజేత
❤లగచర్ల రైతు చేతికి బేడీలు.. KTR అభ్యంతరం
❤14న లోక్ అదాలత్
❤NGKL:రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
❤లగచర్ల కేసు నాంపల్లి కోర్టుకు బదిలీ
❤గ్రూప్-2 పరీక్ష.. నిర్వహణపై ప్రత్యేకంగా నిఘా
❤GDWL:రేపు జాబ్ మేళా
❤కొనసాగుతున్న సీఎం కప్పు క్రీడలు
❤ముగిసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీ

News December 12, 2024

MBNR: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

image

జడ్చర్ల మండలంలోని గంగాపూర్ గ్రామ సమీపంలోని ఆశ్రమం వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొన్న సంఘటనలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. మిడ్జిల్ మండలం రెడ్డి గూడ గ్రామానికి చెందిన జైపాల్ 50, అతని భార్య సౌరీలమ్మ మోటార్ సైకిల్ పై వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.