News September 11, 2025

జూరాల హైలెవల్ బ్రిడ్జి తరలింపుపై ప్రజల ఆగ్రహం

image

ధరూర్ మండలం రేవులపల్లి వద్ద నిర్మించనున్న జూరాల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణాన్ని కొత్తపల్లికి తరలించడంపై స్థానిక గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.121.92 కోట్ల వ్యయంతో ఆర్&బీ శాఖ జూలై 1న జీవో జారీ చేసి, అనంతరం ఇరిగేషన్ అధికారులు రేవులపల్లిలో సర్వే కూడా నిర్వహించారు. అయితే వంతెన కొత్తపల్లి-జూరాల మధ్యకు మళ్లించడంతో రేవులపల్లి, చిన్నచింతరేవుల, నర్సందొడ్డి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 17, 2025

వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాస్ పుస్తకాలు: మంత్రి

image

AP: రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. భూముల రీ క్లాసిఫికేషన్‌పై దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రైవేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తామన్నారు.

News December 17, 2025

దుబ్బా తండా సర్పంచ్‌గా రామ్ నాయక్

image

దేవరుప్పుల మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దుబ్బతండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లకావత్ రామ్ నాయక్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 106 ఓట్ల తేడాతో గెలుపొందారు.

News December 17, 2025

కాలీఫ్లవర్‌లో బట్టనింగ్ లక్షణాలు – నివారణ

image

కాలీఫ్లవర్‌లో సాధారణ పరిమాణంలో కాకుండా చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బట్టనింగ్ అంటారు. ముదురు నారు నాటుకోవడం, నేలలో నత్రజని తక్కువగా అవటం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల బట్టనింగ్ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజుల వయసు గల నారును మాత్రమే నాటుకోవాలి. తగినంత మోతాదులో నత్రజని ఎరువు వాడాలి. అలాగే స్వల్పకాలిక రకాలను ఆలస్యం చేయకుండా సరైన సమయంలో నాటుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.