News April 26, 2024

జైపూర్: గుప్తనిధుల కోసం తవ్వకాలు

image

జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న స్వామి దేవాలయంలోని దొనలో రెండు రోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొనలోని శివలింగాన్ని వదిలిపెట్టి పక్కన తవ్వకాలు చేపట్టారని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఎస్సై శ్రీధర్ ను వివరణ కోరగా ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ఫిర్యాదు అందిందని, విచారణ జరిపి తవ్వకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News April 15, 2026

ADB: పల్లెకు చేరువయ్యేనా ‘ప్రగతి చక్రం’?

image

జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పల్లెవాసులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ‘మహాలక్ష్మి’ పథకంతో బస్సులకు రద్దీ పెరిగినా, తిర్యాణి, నార్నూర్, బజార్‌హత్నూర్, భీంపూర్ వంటి మారుమూల మండలాల్లోని గిరిజన గూడాలకు నేటికీ ఆర్టీసీ సౌకర్యం కలగానే మిగిలింది. వర్షాకాలంలో వాగులు పొంగి రవాణా నిలిచిపోతుండటంతో విద్యార్థులు, రోగులు అల్లాడుతున్నారు. అన్ని కాలాల్లో బస్సు నడపాలని కోరుతున్నారు.

News April 14, 2026

ADB: రేపు జిల్లాకు మంత్రి పొన్నం రాక

image

రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ నెల 15న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా బుధవారం ఆదిలాబాద్‌లో నిర్వహించే పలు కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆర్టీవో అధికారులు మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు.

News April 14, 2026

16 నుండి మండలస్థాయి సదస్సులు : ADB కలెక్టర్

image

జిల్లాలో ఏప్రిల్ 16వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సదస్సులను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. నిన్నగూగుల్ మీట్ లో దిశానిర్దేశం చేశారు. సదస్సుల నిర్వహణలో భాగంగా పోషణ్ మాస్ స్టాల్స్‌తో పాటు గర్భిణీలకు సీమంతాల కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాల్య వివాహ రహిత పంచాయతీలుగా తీర్మానం చేసిన గ్రామాలకు గుర్తింపునివ్వాలన్నారు.