News April 26, 2024

జైపూర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ శివారులోని మూలమలుపు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మద్దులపల్లి గ్రామానికి చెందిన సోల్లూరి అజయ్ ద్విచక్ర వాహనంపై ఇందారంకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి పోచం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.

Similar News

News April 16, 2026

నిప్పుల కొలిమిలా ఆదిలాబాద్

image

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత స్థాయి పెరిగింది. తాంసీ, గుడిహత్నూర్‌లో అత్యధికంగా 42-44°C, ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడలో 41-43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే సెగలు పుడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News April 16, 2026

ఆదిలాబాద్: మేలుకో మిత్రమా..!

image

అందని ఎత్తులు.. అర్థం కాని వేగం.. సరదాగా మొదలై విషాదంగా ముగిసే మైనర్ల డ్రైవింగ్‌పై ఆదిలాబాద్ గడ్డపై ‘ఖాకీ’ హెచ్చరిక గంట మోగింది. “మీ బిడ్డల చేతికి బైక్ తాళాలు ఇవ్వడం అంటే.. మృత్యుపాశాన్ని అందించడమే” అని పోలీసులు పేర్కొంటున్నారు. వారం రోజుల్లో 400 మంది చిన్నారులు స్టీరింగ్ పట్టి రోడ్ల మీదకు రావడం ఆందోళనకరం. అల్లారుముద్దుగా పెంచుకున్న ప్రాణాలు రోడ్డు ప్రమాదాల రక్తపు మడుగులో కలవకముందే.. మేలుకోండి.

News April 15, 2026

చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్ రాజర్షి షా

image

జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రధాన కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్‌ను భాగస్వామ్యం చేయాలని సూచించారు. చలివేంద్రాల్లో తాగునీటితో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల దృష్ట్యా ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని ప్రకటనలో కోరారు.