News November 6, 2025

జ్ఞానాన్ని ప్రసాదించే వ్యాస మంత్రం

image

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ ||3||
వసిష్ఠుడికి మునిమనవడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరుడికి పుత్రుడు, పరమ పవిత్రుడు, గొప్ప తపస్సు సంపద కలిగినవాడు, శుకమహర్షి తండ్రి అయిన ఆ వేదవ్యాస మహర్షికి మనం నమస్కరించాలి. ఆ వ్యాసుడి గొప్ప వంశాన్ని, పవిత్రతను స్మరించుకొని, పూజించడం వలన ఆయనలా జ్ఞానం లభిస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

Similar News

News January 24, 2026

RGM: సమ్మక్క జాతర ప్రదేశాన్ని పరిశీలించిన సీపీ

image

గోదావరిఖని సమ్మక్క జాతర ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. గోదావరి బ్రిడ్జి సమీపంలోని సమ్మక్క జాతర ప్రదేశాన్ని శనివారం పోలీసు అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. జాతర పరిసరాలను పరిశీలించారు. భక్తుల భద్రత, రక్షణ, ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

News January 24, 2026

మంటలు అదుపులోకి.. సెల్లార్‌లో ఐదుగురు: ఫైర్ డీజీ

image

TG: హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చినట్లు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. దట్టమైన పొగ ఉండటంతో సెల్లార్‌లోకి వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. ఆ ఏరియాలో ఫర్నిచర్ భారీగా డంప్ చేశారని, అందుకే సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిందన్నారు. మరో 2 గంటల్లో లోనికి వెళ్తామన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం సెల్లార్‌లో ఐదుగురు చిక్కుకున్నట్లు పేర్కొన్నారు.

News January 24, 2026

సెక్స్ సీడీ కేసులో మాజీ సీఎంకు ఎదురుదెబ్బ

image

2017 ఛత్తీస్‌గఢ్ అశ్లీల సీడీ కేసులో మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ గతంలో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ స్పెషల్ కోర్టు రద్దు చేసింది. మాజీ మంత్రి రాజేశ్ మున్నత్‌ను అప్రతిష్ఠపాలు చేయడానికి అశ్లీల వీడియోలు తయారు చేసి ప్రచారం చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. అదే సమయంలో ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది.