News March 16, 2025
జ్వరం గోళీలు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్: హరీష్ రావు

జ్వరం గోళీలు కూడా ఇవ్వాలని దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X’ వేదికగా మండిపడ్డారు. సర్కార్ దావఖానాలలో మందులు లేవన్న పత్రికా కథనాలను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మళ్లీ ఉమ్మడి పాలన నాటి దుర్భర పరిస్థితులను ముందుకు తెచ్చిందని విమర్శించారు. జ్వరం గోలీలు, కనీసం చిన్న పిల్లలకు ఇచ్చే సిరప్ కూడా లేకపోవడం సీఎం పనితనానికి నిదర్శనం అన్నారు.
Similar News
News April 20, 2025
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: నిర్మల్ కలెక్టర్

రైతుల సౌకర్యార్థం నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గడువులోగా జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి కొనుగోలును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
News April 20, 2025
16,347 పోస్టులు: జిల్లాలు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..

AP: రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉ.10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, స్టేట్, జోన్ లెవెల్‌లో 2,259 పోస్టులున్నాయి. అలాగే 7,487 స్కూల్ అసిస్టెంట్లు, 6,599 సెకండరీ గ్రేడ్ టీచర్ల ఖాళీలున్నాయి. 13 ఉమ్మడి జిల్లాలు, సబ్జెక్టుల వారీగా పూర్తి ఖాళీల వివరాల కోసం <
#SHARE
News April 20, 2025
AP మెగా డీఎస్సీ: షెడ్యూల్ ఇలా

✒ మొత్తం టీచర్ పోస్టులు:16,347
✒ నోటిఫికేషన్ విడుదల: 20-4-2025
✒ దరఖాస్తులు: ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు
✒ హాల్‌టికెట్ల విడుదల: మే 30
✒ పరీక్షలు: CBT విధానంలో జూన్ 6 నుంచి జులై 6 వరకు
✒ ప్రాథమిక కీ విడుదల: చివరి పరీక్ష ముగిసిన 2 రోజులకు
✒ అభ్యంతరాల స్వీకరణ: కీ విడుదలైన 7 రోజుల వరకు
✒ ఫైనల్ కీ విడుదల: జులై మూడో వారం
✒ మెరిట్ లిస్టు: జులై చివరి వారం