News November 17, 2024

ఝరాసంగం: పాము కాటుతో విద్యార్థి మృతి

image

పాముకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన ఝరాసంగం మండల మంచునూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్థుల వివరాలు.. ధనసిరి బాబు, మీనా దంపతుల కుమారుడు భాను ప్రసాద్ (12) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. పొలం వద్ద పత్తి చేనులో పాము కాటుకు గురయ్యాడు. జహీరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 2, 2024

సిద్దిపేట: నేడు సీఎం పర్యటన షెడ్యూల్

image

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్ గ్రామానికి సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. బండ తిమ్మాపూర్‌లో హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బండ తిమ్మాపూర్ చేరుకుంటారు. 3 గంటలకు తిరిగి సీఎం బేగంపేట వెళ్తారని సీఎం పర్సనల్ సెక్రటరీ నర్మల శ్రీనివాస్ ఒక ప్రకటనలో వివరించారు.

News December 2, 2024

MDK: నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో నూతనంగా నిర్మించిన హిందూస్తాన్ లీవర్ కోకాకోలా బేవరేజెస్ ఫాక్టరీని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి శనివారం కోకాకోలా ఫ్యాక్టరీని సందర్శించి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఫ్యాక్టరీ అధికారులతో చర్చించారు.

News December 1, 2024

రాంచంద్రంపురం: జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌లతో సమావేశం

image

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్‌లతో సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన విజయోత్సవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈనెల 7,8,9 డివిజన్, నియోజకవర్గాలు, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి తదితరులు ఉన్నారు.