News February 4, 2025
టార్గెట్‌ను వారంలోగా పూర్తి చేయాలి: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపల్స్‌తో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024-25 సంవత్సర పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్‌లో ఇచ్చిన టార్గెట్‌ను వారంలోగా పూర్తి చేయాలన్నారు. 2019-20 నుంచి 2023-24 వరకు పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్స్ క్లియర్ చేసి వాటి హార్డ్ కాపీస్‌ను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారికి సమర్పించాలని ఆదేశించారు.
Similar News
News February 15, 2025
ఆ రోజు నుంచి మలయాళ సినీ ఇండస్ట్రీ క్లోజ్?

మలయాళ సినిమా భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో ప్రొడ్యూసర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి పరిశ్రమను మూసివేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. అధిక పన్నులు, నటీనటులు రెమ్యునరేషన్ పెంచడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్షన్ & స్క్రీనింగ్‌లతో సహా అన్ని చలనచిత్ర కార్యకలాపాలను నిలిపివేస్తామని వెల్లడించారు.
News February 15, 2025
మోదీని నేను అగౌరవపర్చలేదు: సీఎం రేవంత్

TG: ప్రధాని <<15461493>>మోదీ కులంపై<<>> తాను చేసిన వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో స్పందించారు. మోదీని తాను వ్యక్తిగతంగా అగౌరవపర్చలేదని, పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పానన్నారు. అందుకే ఆయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని మాట్లాడానని తెలిపారు. తన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని మండిపడ్డారు. మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు.
News February 15, 2025
నిజాంసాగర్: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి మృతి

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శనివారం నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. లక్ష్మీ, జీవన్‌లకు 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేయగా అప్పులు అయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. శనివారం జీవన్ మనస్తాపానికి గురై ఉరేసుకొని మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.