News October 5, 2025

టార్గెట్ జూబ్లీహిల్స్.. నేడు బీజేపీ కీలక సమావేశం

image

స్థానిక ఎన్నికల సమరానికి కమలదళం సమాయత్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జుబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పార్టీ నాయకత్వం నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు అధ్యక్షతన జరగనున్న పదాధికారుల సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. స్థానిక ఎన్నికల సన్నద్ధత, జూబ్లీహిల్‌ ఉపఎన్నిక అభ్యర్థిత్వంపై చర్చించనుంది.

Similar News

News January 17, 2026

సీఎం రూట్ అని తెలిసినా వినలేదు.. కేసు నమోదు

image

సీఎం రూట్ ఉన్న విషయం తెలిసి కూడా జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్ యజమాని అక్రమ పార్కింగ్లు చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఫ్యాట్ పిజీయన్ పబ్ నిర్వాహకులు సీఎం రూట్ ఉందని చెప్పినా వినిపించుకోకుండా తమ కస్టమర్లతో వాహనాలను పార్కింగ్ చేయించడంతో సీఎం రూట్‌లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 17, 2026

HYD: ఫేక్ టాబ్లెట్ గుర్తుపట్టడం ఎలా..?

image

HYDలో పలుచోట్ల నకిలీ మందులు విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మందులు కొనుగోలు చేసే సమయంలో స్ట్రిప్‌‌పై బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీలు, కంపెనీ పేరు స్పష్టంగా ఉన్నాయా..? చూడాలి. బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమానం వస్తే DGCA వెబ్‌సైట్‌లో బ్యాచ్ వివరాలు చెక్ చేయాలి. ఫిర్యాదులకు 18005996969 నంబర్‌కు కాల్ చేయండి.

News January 17, 2026

HYD: ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు

image

HYDలో డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వైస్‌ ఛాన్స్‌లర్ ఘంటా చక్రపాణి తెలిపారు. డిగ్రీ చదువుతున్న 690 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో అవసరమైన నైపుణ్యాలు పెంపొందించి, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.