News September 9, 2025

టీచర్‌గా మారిన మంచిర్యాల జిల్లా కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ టీచర్ అవతారం ఎత్తారు. భీమారం మండలం కాజీపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. బోర్డుపై ప్రశ్నలు రాసి, విద్యార్థుల చేత సమాధానాలు రాబట్టారు. విద్యారంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో సకల సదుపాయాల కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు.

Similar News

News December 5, 2025

DOB సర్టిఫికెట్లపై ఆ ప్రచారం ఫేక్: PIB

image

డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2026 ఏప్రిల్ 27 తుది గడువుగా నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను PIB Fact Check ఖండించింది. వాట్సాప్‌లో వైరలవుతోన్న ఈ సమాచారం అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రభుత్వం అలాంటి నోటిఫికేషన్ లేదా గడువును జారీ చేయలేదని పేర్కొంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను షేర్ చేయొద్దని పౌరులకు సూచించింది.

News December 5, 2025

పెద్దపల్లి: పట్టాలపై కారు.. తప్పిన పెను ప్రమాదం

image

పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే గేటు వద్ద శుక్రవారం భారీ ప్రమాదం తప్పింది. గేటు ఒక్కసారిగా అకస్మాత్తుగా లాక్ అవ్వడంతో కారు పట్టాలపై నిలిచిపోయింది. రైలు హారన్ వినిపించడంతో కారులో ఉన్నవారితో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ట్రైన్ల రాకపోకలు నిలిపివేశారు. 30 నిమిషాల పాటు శ్రమించి గేటు మరమ్మతులు చేశారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పింది.

News December 5, 2025

అర్హులందరికీ జీవన భృతి: మంత్రి అచ్చెన్న

image

మొంథా తుఫాన్ కార‌ణంగా ప్ర‌భుత్వం వేటకు వెళ్లరాద‌ని ప్రకటించడంతో మ‌త్స్య‌కారులు 5 రోజులు పాటు వేట‌కు
వేళ్ల‌లేదు. జీవన భృతిని ప్ర‌భుత్వం ఇస్తుంద‌ని ప్ర‌క‌టించింది. దీంతో వారంద‌రికీ 50 కేజీల బియ్యాన్ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులంద‌రికీ భృతి పంపిణీ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని మంత్రి హామీ ఇచ్చారు.