News March 4, 2025

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే!

image

➤శ్రీపాల్‌రెడ్డి-13969 (గెలుపు), ➤అలుగుబెల్లి నర్సిరెడ్డి- 8448, ➤హర్షవర్ధన్ రెడ్డి-6034, ➤పూల రవీందర్- 3992, ➤సర్వోత్తంరెడ్డి-2645, ➤సుందర్‌రాజ్-2141, ➤వెంకటస్వామి-439, ➤బాబురావు-132, ➤శంకర్-120, ➤ఏలే చంద్రమోహన్-102, ➤వెంకటయ్య-39, ➤జంగిటి కైలాసం-26, ➤పన్నాల గోపాల్‌రెడ్డి-24, ➤అర్వ స్వాతి-20. ➤లింగిడి వెంటేశ్వర్లు-15. ➤పురుషోత్తంరెడ్డి-11. ➤రాజు-7. ➤సాయన్న-5. ➤చలిక చంద్రశేకర్-1. ➤ఇన్ వ్యాలీడ్-9672

Similar News

News December 13, 2025

వరంగల్ NIT అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానస్పద మృతి

image

ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి వరంగల్ ఎన్ఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి(43) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 13, 2025

MNCL: జీపీ ఎన్నికలు.. సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు

image

ఈనెల 14న జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంచిర్యాల జిల్లాలలోని బెల్లంపల్లి, కన్నెపల్లి, భీమిని, తాండూర్, నెన్నెల, కాసిపేట, వేమనపల్లి మండలాల్లో 12వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 14న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యే వరకు సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.

News December 13, 2025

పోచారంలో పదవుల పరేషానీ.!

image

GHMC పునర్విభజనలో భాగంగా పోచారం మున్సిపాలిటీని కేవలం ఒకే డివిజన్‌గా కుదించడంపై నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సుమారు 90 పదవులు కనుమరుగు కానుండడంతో, స్థానిక రాజకీయ సమీకరణాలను తారుమారు చేస్తోంది. రాజకీయంగా ఎదగాలనుకున్న ఆశావహుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. దాదాపు లక్షకు పైగా ఓట్లున్న ఈ ప్రాంతాన్ని 2-3 డివిజన్‌లుగా చేయాలని, ఇప్పటి వరకు 65 అభ్యంతరాలు వచ్చాయని Way2Newsకు DC నిత్యానంద్ తెలిపారు.