News August 23, 2025
టీడీపీ నేత పొలంలో క్షుద్ర పూజల కలకలం

పెద్దకడబూరు మండలం జాలవాడికి చెందిన టీడీపీ గ్రామ అధ్యక్షుడు ముక్కన్న పత్తి పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం క్షుద్ర పూజలు చేశారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపుతుంది. మూడు నెలల క్రితం ముక్కన్న ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసిన దుండగులే ఇప్పుడూ పత్తి పొలంలో చేసినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై ముక్కన్న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
Similar News
News January 23, 2026
బ్రెజిల్‌తో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు: మోదీ

బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘కొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్న IND-బ్రెజిల్ భాగస్వామ్యంపై సమీక్షించాం. గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి మా సహకారం చాలా ముఖ్యం’ అని ట్వీట్ చేశారు. ‘FEB 19-21 మధ్య నా ఢిల్లీ పర్యటనపై డిస్కస్ చేశాం. భౌగోళిక పరిస్థితులు, గాజాలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించాం’ అని లూలా పేర్కొన్నారు.
News January 23, 2026
ప.గో: వైద్య శాఖ అభ్యంతరాలకు దరఖాస్తులు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని వైద్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మవద్దని డీఎంహెచ్వో అమృతం గురువారం స్పష్టం చేశారు. Pharmacist (Contract Basis) టెంటేటివ్ మెరిట్ లిస్టు https://westgodavari.ap.gov.in/ వెబ్ సైట్‌లలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 24వ తేదీ 5 గంటలలోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అందించాలని సూచించారు.
News January 23, 2026
MHBD: సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై నాయకుల కసరత్తు..!

మహబూబాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఆశావహులు భారీగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాలుగా మారింది. కాంగ్రెస్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో సర్వేల ఆధారంగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. వార్డుల్లో పట్టున్న నేతల కోసం బీఆర్ఎస్ సైతం సర్వేలు చేస్తున్నారు.


