News September 11, 2025

టీడీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది: సజ్జల

image

టీడీపీ ఫేక్ ప్రచారంతో అబద్ధాలను నిజాలుగా చూపిస్తోందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన బీసీ అనుబంధ విభాగాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షం మనకు ఒక మంచి అవకాశమని, వెనుకబడిన కులాలన్నింటినీ చైతన్యపరిచి జగన్ వలనే భవిష్యత్తు ఉంటుందని వారికి వివరించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Similar News

News December 14, 2025

నెల్లూరులో ఎత్తులకు పైఎత్తులు.. మేయర్ ట్విస్ట్!

image

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కిడ్నాప్, బెదిరింపులకు దారి తీసింది. TDP, YCP నాయకులు పోలీస్ స్టేషన్‌కు సైతం వెళ్లారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలనే ఉద్దేశంతో TDP నేతలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కొందరికి డబ్బులు ఆఫర్ చేసినట్లు సమాచారం. మేయర్ పీఠం కోసం ఇలా రెండు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటే రాజీనామాతో స్రవంతి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మానం ఉండదని తెలుస్తోంది.

News December 14, 2025

పాక్‌తో మ్యాచ్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్

image

మెన్స్ U19 ఆసియా కప్‌లో భాగంగా దుబాయిలో భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. కాసేపట్లో టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆరంభించనుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.

IND: ఆయుశ్ మాత్రే (C), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్, వేదాంత్, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్, ఖిలాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్

News December 14, 2025

SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

image

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.