News May 7, 2025

టూరిస్టుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: సబ్ కలెక్టర్

image

రంపచోడవరం నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సబ్ కలెక్టర్ కల్పశ్రీ ఆదేశించారు. రంపచోడవరంలో అటవీ, రెవెన్యూ అధికారులతో శుక్రవారం సాయంత్రం సమావేశం జరిగింది. పర్యాటకులు వాటర్ ఫాల్స్‌లోకి వెళ్లకుండా భద్రతా వలయాలు ప్రతి చోట ఏర్పాటు చేయాలని, వ్యూ పెయింట్స్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News February 14, 2026

ఎమ్మెల్యే ఇకనైనా తమకు స్వేచ్ఛ కల్పిస్తారా, లేదా: జీవన్ రెడ్డి

image

ఎమ్మెల్యే ఇకనైనా తమకు స్వేచ్ఛ కల్పిస్తారా.. లేదా.. అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నేడు గెలిచిన అభ్యర్థులను ఎమ్మెల్యే లోబరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, ఎమ్మెల్యే నుంచి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వేచ్ఛ ప్రసాదించండి అని అధిష్టానాన్ని కోరారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఎమ్మెల్యే సంజయ్ కారణమయ్యారని మండిపడ్డారు.

News February 14, 2026

జగిత్యాల: పార్టీ నిరాకరించినా.. ప్రజలు మాత్రం ప్రజా సేవకులకే పట్టం

image

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డు బీజేపీ టికెట్ ఆశించిన ఆరవ లక్ష్మి (బిట్టు), 26వ వార్డు బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ పులి రమ (శ్రీధర్) టికెట్ దక్కక ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. బీజేపీ టికెట్‌ను వేరే వారికి కేటాయించడంతో వీరి కుమారులు కన్నీరు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పార్టీ నిరాకరించినా ప్రజలు మాత్రం ప్రజా సేవకులను ఆదరిస్తారు అనే దానికి ఇదే నిర్వచనం.

News February 14, 2026

ఈ ఫలితాలు ప్రజల విశ్వాసాన్ని చాటాయి: ఖర్గే

image

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు పార్టీపై ప్రజల విశ్వాసాన్ని చాటాయని పేర్కొన్నారు. 3.8 కోట్ల ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారిత, నిరంతర పురోగతి అందిస్తూ ‘ప్రజా తెలంగాణ’కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ కాసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు.