News March 9, 2025
టెక్కలి : నూతిలో పడి బాలుడి మృతి

టెక్కలి మండలం గోపినాధపురానికి చెందిన బెండి దీపక్ (16) అనే బాలుడు ఆదివారం నూతిలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం.. దీపక్ తన స్నేహితులతో కలిసి గోపీనాథపురం సమీపంలో ఉన్న నూతికి స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నూతిలో పడిపోయాడని తెలిపారు. దీంతో స్థానికులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 24, 2026
SKLM: నేటి సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు..!

రథసప్తమి వేడుకల్లో భాగంగా శనివారం నాటి వివరాలు ఇలా…
*సాయంత్రం 6.గం లకు తన్మయి శాస్త్రీయ నృత్యం, గణపతి శర్మ, యామిని కర్రిల మ్యూజికల్ షోలు,
రాత్రి 7:00 నుంచి థమన్ లైవ్ కాన్సర్ట్, ఢీ డాన్సర్స్ ఆక్సా ఖాన్, మణికంఠ, తేజస్వినిల ప్రదర్శనలు,* సినీ నటుడు ఆది ముఖ్య అతిథిగా హాజరుకాగా, ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, చంద్రికలు యాంకర్లుగా, డ్రోన్ షో కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు.
News January 24, 2026
ఆమదాలవలస మహిళకు జిల్లా బాధ్యతలు

వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఆమదాలవలసకు చెందిన అజంత కుమారిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. పార్టీ మహిళా విభాగం కమిటీ నియామకంలో భాగంగా అజంతా కుమారిని జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పించారు. తనకిచ్చిన గుర్తింపును బాధ్యతగా నిర్వహిస్తామని తెలిపారు.
News January 24, 2026
ఇవాళ అర్ధరాత్రి అరసవెల్లి ఆలయంలో అద్భుత ఘట్టం

సిక్కోలులో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదిత్యునికి శనివారం అర్ధరాత్రి 1 గంట నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు క్షీరాభిషేకం జరుగనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఆదిత్యుడు భక్తులకు దర్శనమిస్తారు. లక్షలాది మంది భక్తులు తరలిరానుండటంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. 250 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి, శీఘ్ర దర్శనం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు.


