News August 21, 2025
టెక్కలి: సెప్టెంబర్ 1 నుండి డిగ్రీ తరగతులు ప్రారంభం!

ఎట్టకేలకు డిగ్రీ ఫస్టియర్ కోర్సులకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 20 నుండి 26 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్స్ కొరకు 24 నుండి 28 లో తేదీ వరకు, సీట్ల కేటాయింపు 31 వ తేదీన ఉంటుంది. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జిల్లాలో ఉన్న 15 ప్రభుత్వ, 74 ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు రావడంతో ప్రవేశాలపై ప్రిన్సిపాళ్ళు, సిబ్బంది దృష్టి సారిస్తున్నారు
Similar News
News January 23, 2026
సిక్కోలులో భారీగా పోలీసు బందోబస్తు: SP

జిల్లాలో రథసప్తమి వేడుకలకు 15 డ్రోన్ కెమెరాలు 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి వెల్లడించారు. నగరంలో బందోబస్తు ఏర్పాటుకు ఆరుగురు SPల పర్యవేక్షణలో 16 మంది DSPలు, 50 మంది CIలు, 170 మంది SIలు, 2,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి సెక్టార్లో భద్రతను పటిష్ఠంగా అమలు చేస్తున్నామన్నారు.
News January 23, 2026
వర్సిటీల నిధులు, నియామకాలపై PUC ఛైర్మన్ సమీక్ష

రాష్ట్రంలో ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని PUC ఛైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అంబేడ్కర్ యూనివర్సిటీ, JNTU విజయనగరం, IIIT శ్రీకాకుళం యూనివర్సిటీల నిధుల వినియోగం, నియామకాలు, ఆదాయ-వ్యయాలు, పరిపాలనా పనితీరుపై సమీక్షించారు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు పూర్తిగా విద్యార్థుల మేలు కోసం వినియోగించాలన్నారు.
News January 23, 2026
రాష్ట్రపతితో విందుకు సిక్కోలు విద్యార్థినికి ఆహ్వానం

శ్రీకాకుళం మండలం ఇప్పిలి జడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇప్పిలి సంజనకు రాష్ట్రపతితో విందు చేసేందుకు ఆహ్వానం అందింది. శుక్రవారం పాఠశాల హెచ్ఎం సుజాత ఈ విషయాన్ని చెప్పారు. విద్యార్థిని సంజన గత మూడేళ్లుగా ప్రాజెక్టులు తయారు చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్‌కు పంపిస్తోంది. ఆమె తయారు చేసిన డ్యూయల్ సోలార్ ట్రాకర్ సిస్టం ప్రాజెక్ట్ ఆ సంస్థను ఆకర్షించింది. ఈమె ప్రతిభను గుర్తించి ఈ అవకాశం కల్పించింది.


