News May 23, 2024

టెక్కలి: 25న రగ్బీ జిల్లా స్థాయి అండర్-18 ఎంపికలు

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25వ తేదీన అండర్-18 జిల్లాస్థాయి రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పార్వతీశంలు గురువారం తెలిపారు. 2006 నుంచి 2008 మధ్య కాలంలో జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణరావును సంప్రదించాలని కోరారు.

Similar News

News March 13, 2026

శ్రీకాకుళం: మాజీ డీజీపీ మృతి

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ హెచ్.జె.దొర శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. శ్రీకాకుళం జిల్లా జర్జంగి గ్రామానికి చెందిన ఆయన.. విధి నిర్వహణలో అత్యంత నిజాయతీ, నిబద్ధత గల పోలీసు అధికారిగా చెరగని ముద్ర వేశారు. దొర ఆకస్మిక మరణం పోలీసు శాఖకు, ఆయన సొంత జిల్లాకు తీరని లోటు.

News March 13, 2026

తాగునీటి పథకానికి రూ.602 కోట్లు మంజూరు: మంత్రి

image

ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకు తాగునీటి కోసం రూ.602 కోట్లు మంజూరైనట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిలో నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. దీంతో ఈ నియోజకవర్గ ప్రజల దాహార్తి పూర్తిగా తీర్చేందుకు ఈ నిధులు వినియోగిస్తామని అన్నారు.

News March 13, 2026

శ్రీకాకుళం: జనాభా ఆధారంగా పంచాయితీల విభజన!

image

ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీ సర్పంచులు పదవీకాలం ముగుస్తుంది. సకాలంలో ఎన్నికలు జరగకపోయినా, కొన్ని నెలల్లో నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 912 పంచాయతీలు ఉండగా, కొత్త పంచాయతీలు పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా 10 వేలు జనాభా దాటిన గ్రామాలను రూర్బన్, 10,000 లోపు గ్రామాలను గ్రేడు -1, జనాభా 2000 లోపు ఉంటే గ్రేడ్ -2 విభజన జాబితా కసరత్తు చేస్తున్నారు.