News December 3, 2025

టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

image

ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తత్కాల్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు డీఈవో ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. అభ్యర్థులు రూ.600 అదనపు రుసుము చెల్లించి అడ్మిషన్ పొందవచ్చన్నారు. ముఖ్యంగా పాత సిలబస్‌లో పదో తరగతి ఫెయిల్ అయిన వారికి ఇది మంచి అవకాశమని ఆమె పేర్కొన్నారు.

Similar News

News February 18, 2026

ఏడుపాయలలో తప్పిపోయిన చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు

image

ఏడుపాయల జాతరలో తప్పిపోయిన ఐదేళ్ల బాలికను అదనపు ఎస్పీ మహేందర్ క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి మానవీయత చాటుకున్నారు. భక్తుల రద్దీలో ఏడుస్తున్న చిన్నారిని గమనించిన ఆయన పాపకు ధైర్యం చెప్పి వివరాలు సేకరించారు. పోలీసు యంత్రాంగం సాయంతో బాలిక తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. వేల మంది జనాల మధ్య తమ బిడ్డను క్షేమంగా చేర్చిన అదనపు ఎస్పీకి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.

News February 18, 2026

గన్నవరం ఎయిర్‌పోర్ట్.. ఒకే రోజు 3,883 మంది ప్రయాణం!

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మంగళవారం 40 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 20 సర్వీసుల ద్వారా 2,062 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 1,821 మంది 20 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.

News February 18, 2026

మదనపల్లె ఘటన.. నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం

image

AP: అన్నమయ్య(D) మదనపల్లెలో <<19164033>>బాలిక హత్య<<>>పై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రులతో ఆయనతోపాటు మంత్రులు లోకేశ్, అనిత మాట్లాడారు. నిందితుడిని వదిలిపెట్టబోమని, కఠినశిక్ష పడేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు. మరోవైపు బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు కులవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.