News November 30, 2025
టెస్టుల్లోకి కోహ్లీ రీఎంట్రీ?

టెస్టు క్రికెట్‌లో IND వరుస ఓటముల నేపథ్యంలో BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరే అవకాశం ఉందని Cricbuzz వెల్లడించింది. తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఓ ఆటగాడు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా కోహ్లీ, రోహిత్, అశ్విన్, పుజారా లాంటి సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత టీమ్ దెబ్బతిన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News February 10, 2026
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి: కేంద్రం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు తమ పరిశీలనలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచడంపై BJP ఎంపీ ఈటల రాజేందర్ లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్ శర్మ పైవిధంగా సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి నుంచి 2 బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చాయని వివరించారు.
News February 10, 2026
‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై స్పందించిన నరవణె

‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంపై వివాదం చెలరేగిన వేళ మాజీ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె స్పందించారు. పుస్తకం పబ్లిషింగ్, డిజిటల్ ఫామ్, ప్రింట్ పూర్తి కాలేదని వెల్లడించారు. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పోస్ట్‌కు ట్యాగ్ చేశారు.
News February 10, 2026
భారీ టార్గెట్‌ను ఊదేశారు

T20WC: UAEపై న్యూజిలాండ్ జట్టు ఘన విజయం నమోదు చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు టిమ్(89), ఫిన్ అలెన్(84) బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సులతో చెలరేగారు. 4.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగించేశారు. యూఏఈ బౌలర్లు ఎవరూ కివీస్ బ్యాటర్లపై ప్రభావం చూపలేకపోయారు. రొహిద్ ఖాన్, జునైద్‌లు 40+ పరుగులు సమర్పించుకున్నారు.


