News November 30, 2025
టెస్టుల్లోకి కోహ్లీ రీఎంట్రీ వార్తలు.. బీసీసీఐ క్లారిటీ!

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్(టెస్టు) నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరనున్నట్లు వచ్చిన <<18430290>>వార్తలను <<>>బీసీసీఐ కొట్టిపారేసింది. అవన్నీ రూమర్లేనని స్పష్టం చేసింది. కోహ్లీకి తాము ఎలాంటి రిక్వెస్ట్ చేయలేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. ఈ విషయంలో బోర్డు కనీసం చర్చించలేదని పేర్కొన్నారు. ‘దీనిపై కోహ్లీతో మాట్లాడలేదు. పుకార్లకు ప్రాధాన్యం ఇవ్వొద్దు’ అని కోరారు.
Similar News
News February 16, 2026
అనంత: PGRS రద్దు.. కారణం ఇదే.!

ఈనెల 16న జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. CM ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలతో కలిసి బిల్గేట్స్ బృందంతో విజయవాడలో సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయుల్లో కూడా కార్యక్రమాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు.
News February 16, 2026
స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే అంటే..

దేశవ్యాప్తంగా పట్టణాల్లో పారిశుద్ధ్య ప్రమాణాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి నిర్వహిస్తున్న వార్షిక సర్వేను స్వచ్ఛ సర్వేక్షన్ అంటారు. వీధుల శుభ్రత, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాల ప్రాసెసింగ్, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, పౌరుల అభిప్రాయం వంటి అంశాలపై మార్కులు కేటాయించి ర్యాంకులు ప్రకటిస్తారు. దీనికోసం వచ్చే నెల కేంద్ర బృందం విశాఖ రానుంది. ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ప్రధాన లక్ష్యం.