News March 3, 2025
టైమొచ్చింది.. విశాఖ మేయర్ పీఠం కదులుతుందా..?

జీవీఎంసీ మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కూటమి కసరస్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మార్చి 18కి జీవీఎంసీ మేయర్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించకపోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
Similar News
News March 22, 2025
విశాఖ: కళాకారులకు జిల్లాస్థాయి అవార్డులు

విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో అత్యంత ప్రతిభ కనబరిచిన కళాకారులను ఆదివారం కళా ప్రవీణ 2025 పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కే జనార్ధన్ పేర్కొన్నారు. శనివారం వారు మహారానిపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా నుంచి గుర్తింపు పొందిన కళాకారులను ఎంపిక చేసి స్థానిక కళ్యాణ మండపంలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.
News March 22, 2025
MLAకి రూ.2 లక్షలు చెల్లించండి: విశాఖ కోర్టు

పలాస MLA గౌతు శిరీషకు రూ.2 లక్షలు చెల్లించాలని విశాఖ జూనియర్ డివిజనల్ అదనపు సివిల్ న్యాయాధికారి తీర్పునిచ్చింది. 2023లో ఆమెపై ఓ పత్రిక అసత్య ఆరోపణలు చేస్తూ వార్త ప్రచురించిందని కోర్టులో కేసు వేశారు. ఈ మేరకు కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. ఆ పత్రిక ఎడిటర్, పబ్లిషర్ జగదీశ్వరరావుకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది.
News March 22, 2025
అనకాపల్లిలో రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశింకోట మండలం నేషనల్ హైవేపై ఎన్‌జీ పాలెం వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకున్నాడు. అతికష్టం మీద అతడిని బయటకు తీశారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.