News August 12, 2025

ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్న మిల్స్ కాలనీ పోలీసులు

image

వరంగల్‌లోని శంభునిపేట, రంగశాయిపేటలో రోడ్ల పైకి భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే మిల్స్ కాలనీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై నిలిచిన వాహనాలను పోలీసులు క్రమబద్ధీకరించడంతో పాటు రోడ్డు పైకి నీరు రాకుండా జాగ్రత్తలు చేపట్టారు. పోలీసులు స్పందించిన తీరు పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News March 17, 2026

ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చారు: వైసీపీ

image

కూటమి ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చిందని వైసీపీ విమర్శించింది. నాడు వంద రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పి.. నేడు రాష్ట్రం మొత్తం గంజాయి అమ్మకాలు జోరుగా సాగిస్తోందని ధ్వజమెత్తింది. ప్రస్తుతం టీడీపీ నాయకులు, వారి కొడుకులు డ్రగ్స్ వ్యాపారంలో మునిగితేలుతున్నారని, ఏకంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్‌తో దొరికిపోవడంతో టీడీపీ నాయకులు సిగ్గుతో కుమిలిపోతున్నారని పేర్కొంది.

News March 17, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,600
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,352
* వెండి 10 గ్రాముల ధర రూ.2,610.

News March 17, 2026

బాపట్ల రైతులకు JC సూచనలు

image

రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1,73,384.540 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 28తో మూసివేస్తారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని 28 లోపు విక్రయించుకోవాలన్నారు.