News November 19, 2025
ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు: వరంగల్ పోలీసులు

ద్విచక్రవాహనాలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సురక్షిత డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 17, 2026
రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్.. నేడే శంకుస్థాపన

AP: రాష్ట్రంలో రూ.13,000 కోట్ల పెట్టుబడితో 495 ఎకరాల్లో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకి నేడు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 2,600 మందికి ఉపాధి దక్కనుంది. దీనిని AM గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తుండగా ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్ను గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది.
News January 17, 2026
WCలో బంగ్లాదేశ్.. నేడు క్లారిటీ

T20 WCలో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు <<18871702>>ఐసీసీ<<>> రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముంబై, కోల్‌కతాలో తమ మ్యాచ్‌లు నిర్వహించవద్దని BCB కోరుతోంది. ఈ నేపథ్యంలో ICCకి చెందిన ఇద్దరు అధికారులు నేడు ఢాకాలో పర్యటించి BCB ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. దీంతో ఈ విషయంలో నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
News January 17, 2026
HYD: ఈ వారం టన్నెల్ ప్లాన్ ఖరారు

జేబీఎస్-శామీర్‌పేట కారిడార్‌లో భాగంగా హకీంపేట వద్ద 1.6 కిలోమీటర్ల మేర మెట్రోను అండర్ గ్రౌండ్‌లో నిర్మించాలని ఈ వారంలోనే ప్రభుత్వం పక్కాగా ఓకే చేసింది. రక్షణ శాఖ నిబంధనల ప్రకారం భారీ బడ్జెట్‌తో ఈ టన్నెల్ ప్లాన్ ఫైనల్ అయ్యింది. వచ్చే నెలలో ఇక్కడ మట్టి పరీక్షలు, టన్నెల్ మిషన్ల కోసం సర్వే మొదలు కానుంది. హకీంపేట రన్‌వే దగ్గర మెట్రో పిల్లర్లు కనిపించవు. మెట్రోకున్న అతిపెద్ద అడ్డంకి <<18874553>>క్లియర్<<>> అయిపోయింది.


