News November 19, 2025

ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు: వరంగల్ పోలీసులు

image

ద్విచక్రవాహనాలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సురక్షిత డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 20, 2026

బోరాబండలో దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

image

HYD బోరాబండలోని రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన భార్య రొడ్డె సరస్వతి (32)ని భర్త రొడ్డె ఆంజనేయులు రోకలి బండతో దాడి చేసి హతమార్చాడు. భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తుందని ఆంజనేయులు అనుమానిస్తూ తరచూ గొడవ పడేవాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

News January 20, 2026

చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

image

మిగతా సీజన్​లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్​లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.

News January 20, 2026

HYD: కొండపై కొలువైన శ్రీనివాసుడు

image

బిర్లా మందిర్.. ఎత్తైన కొండపై నగరవాసులకు ఆధ్యాత్మిక ప్రాంతంగా వెలిగిపోతోంది. హుస్సేన్‌సాగర్‌కు దక్షిణాన నౌబత్‌పహాడ్, కాలాపహాడ్ కొండలపై కొలువై కళకళలాడుతోంది. 1976లో రాజస్థాన్‌ తెల్ల పాలరాయితో బిర్లా ఫౌండేషన్‌ నిర్మించింది. ఉత్తర, ఉత్కల్, ద్రవిడ వాస్తు శైలుల సమ్మేళనంగా నిర్మించారు. ఈ గుడిలో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి రూపం తిరుమలలోని స్వామిని స్మరింపజేస్తుంది. నగర శోభను మరింత పెంచుతోంది.