News November 19, 2025
ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు: వరంగల్ పోలీసులు

ద్విచక్రవాహనాలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సురక్షిత డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 17, 2026
మెదక్: ప్రాణరక్షణకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కేవలం నిబంధనగా కాకుండా, వ్యక్తిగత భద్రతగా భావించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.
News January 17, 2026
పాతబస్తీ మెట్రోపై హైకోర్టు ఆరా.. ఫిబ్రవరి 4న కీలక నివేదిక!

MGBS-ఫలక్‌నుమా రూట్‌లో నిర్మించే మెట్రో లైన్ విషయంలో చారిత్రక కట్టడాల రక్షణపై హైకోర్టు దృష్టి సారించింది. చార్మినార్ వంటి కట్టడాల దృశ్య సౌందర్యం దెబ్బతినకుండా పిల్లర్ల నిర్మాణం ఎలా ఉంటుందో వర్చువల్ వాక్‌త్రూ ద్వారా FEB 4లోగా చూపాలని అధికారులను ఆదేశించింది. వారసత్వ సంపదకు నష్టం వాటిల్లని రీతిలో మెట్రో అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. దీని ఆధారంగానే 5.5KM మేర సాగే ఈ మెట్రో లైన్ ఖరారు కానుంది.
News January 17, 2026
మున్సిపల్ ఎన్నికల శంఖం పూరించిన రేవంత్

TG: పాలమూరు వేదికగా సీఎం రేవంత్ మున్సిపల్ ఎన్నికల సమరశంఖం పూరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.


