News August 11, 2025

ట్రైబల్ మ్యూజియం పెయింగ్ వేసిన ITDA PO సతీమణి

image

భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం పిఓ రాహుల్ అపురూప సృష్టి. ఇది భౌతికంగా అద్భుతమైన మ్యూజియం. ఈ భవనాన్ని, ప్రాంగణాన్ని అపురూప చిత్రంగా మలిచారు పిఓ రాహుల్ సతీమణి మనీషా రాహుల్. పిఓ తరహాలోనే ఏదో ఒక నూతనత్వాన్ని అందించాలని గిరిజన మ్యూజియం ఫోటోని చేతులతో గీసి పిఓ రాహుల్‌కు అందజేశారు. ఈ పెయింటింగ్ ఆమె కళావైభవానికి ప్రత్యేకం అని చెప్పవచ్చు.

Similar News

News March 17, 2026

ఏలూరి ఎంపీకి తొలి డ్రగ్ టెస్టులో నెగిటివ్.. కారణం ఇదే?

image

మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ కేసులో సిట్ చీఫ్ యోగేశ్ గౌతమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ పుట్టా మహేశ్ మెథ్, కొకైన్ వంటి రెండు రకాల డ్రగ్స్ తీసుకున్నారని చెప్పారు. డ్రగ్ శరీరంలోకి చేరేలోపే టెస్ట్ చేయడంతో ఎంపీ మహేశ్‌కు తొలుత నెగిటివ్ వచ్చిందన్నారు. 5 గంటల తర్వాత రెండోసారి టెస్ట్ చేసినప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని పేర్కొన్నారు.

News March 17, 2026

BIG BREAKING: KNR: నేను కాంగ్రెస్‌లోనే ఉన్నాను: జీవన్‌రెడ్డి

image

తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఈరోజు జగిత్యాలలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ను వదిలితే ఫ్లెక్సీలు ఏంటి అన్నీ మారతాయన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ వదిలితే ఎందులో చేరాలో ఆలోచిస్తానన్నారు. తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం MLA సంజయ్ అని, కాంగ్రెస్‌తో తనది 40 ఏళ్ల బంధమన్నారు. తనకు ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

News March 17, 2026

రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే: ఆది శ్రీనివాస్

image

రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.20,616 కోట్లను ఏకకాలంలో మాఫీ చేశామని అన్నారు. దీంతో సుమారు 25 లక్షల మంది రైతులు కొత్తగా రుణం పొందే అవకాశం కల్పించామన్నారు. రైతు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతు అన్నారు.